నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బూసి మహేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని, కబ్రస్తాన్, వైకుంఠధామాల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూముల కు హక్కును కల్పించి పట్టాలను ఇవ్వాలని, డప్పు చెప్పు మృత్తిదారులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు వరకు పెంచాలని, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ లోన్లు తీసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఉపయోగించి ప్రతి దళిత వాడను అభివృద్ధి చేయాలని, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లను విద్య హక్కు చట్టం ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగ, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగళ్ల రమేష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘీ స్వామి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం మహేందర్, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బొట్ల అనిల్, కలకుంట్ల రమేష్, బైరపాక సురేష్, మోత్కుపల్లి రవి, ముడుగుల రాములు, బోగారం మురళి, పెరుమళ్ళ కిషన్, బొట్ల మహేష్, బొట్ల పరశలు పాల్గొన్నారు.