Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి 

గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి 

- Advertisement -

– గ్రామీణ వైద్యులపై ఐఎంఏ దాడులను ఆపాలి 
– ఆర్.ఎం.పి, పి.ఎం.పి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి 
– గ్రామీణ వైద్యుల సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా మల్లేష్ 
నవతెలంగాణ-పాలకుర్తి : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, ప్రధమ చికిత్స చేసుకోవడానికి అర్హత కల్పించాలని ఆర్ఎంపి, పి.ఎం.పి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దోట వెంకటాచారి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలో గల ప్రగతి విద్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం గ్రామీణ వైద్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపురం వెంకన్న గౌడ్ తో కలిసి వెంకటాచారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు వైద్యాన్ని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే ఎయిడ్స్, పల్స్ పోలియో కార్యక్రమాల్లో గ్రామీణ వైద్యులు భాగస్వాములవుతున్నారని తెలిపారు. గ్రామీణ వైద్యులపై ఐఎంఏ దాడులు నిర్వహిస్తుందని, గ్రామాల్లో గ్రామీణ వైద్యులు వైద్యం చేయకుంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి అధోగతిలా మారుతుందని తెలిపారు. ఐఎంఏ దాడులను ఆపాలని, గ్రామీణ వైద్యులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని కోరారు. 
గ్రామీణ వైద్యుల నియోజకవర్గం అధ్యక్షునిగా మల్లేషం
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షునిగా పాలకుర్తి గ్రామానికి చెందిన లొంక మల్లేశం ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రగతి విద్యాలయంలో  గ్రామీణ వైద్యుల నియోజకవర్గస్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షునిగా భీమయ్య,ఉపాధ్యక్షులుగా అన్నం వెంకన్న, గడ్డం రాజమల్లు, ఎస్.కె సలీమ్, ప్రధాన కార్యదర్శిగా ఎండి నయీమ్, సహాయ కార్యదర్శిగా ఎం విజయ్ కుమార్, కోశాధికారిగా కొంగ సతీష్ కుమార్, అధికార ప్రతినిధిగా సోమేశ్వరరావు,  సలహాదారులుగా దండు రమేష్, గరిగంటి ప్రభాకర్, వెంకన్న, రాంచందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ గ్రామీణ వైద్యులపై నిర్వహిస్తున్న దాడులతో గ్రామీణ వైద్యుల జీవన పరిస్థితి  అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్య మీద దాడులను ఆపకుంటే రాబోవు రోజుల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు పోరాటాల గడ్డ పాలకుర్తి నుండి తిరుగుబాటు చేస్తామని, వైద్యం చేయకుండానే నిరసన తెలుపుతామని తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఐఎంఏ దాడులను ఆపాలని, గ్రామీణ వైద్యులను గుర్తించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -