Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ 
పంట నష్టపోయిన రైతులను ఆదుకుని లక్ష్మీదేవుని పల్లి, అంతంపల్లి మధ్యలో ఎడ్ల కంట వాగు పైబ్రిడ్జిని నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీదేవుని పల్లి గ్రామాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సందర్శించారు. గ్రామ రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. గ్రామంలో 100 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. పంటలు సాగు చేయాలన్నా దాంట్లో పేరుకుపోయిన ఇసుకరాలను తొలగించాలన్న ఖర్చుతో కూడుకున్న పని అని ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు.

రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఎడ్ల కట్ట వాగును సందర్శించారు. ప్రభుత్వం వెంటనే దీనిపై బ్రిడ్జిని నిర్మించాలన్నారు. వర్షాలకు వాగు ప్రవహించడంతో గ్రామంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డిజి నరసింహారావు, శోభన్, జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, అరుణ్, గ్రామ వీడిసి అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి, బాపురెడ్డి, తిమ్మారెడ్డి, లింగారెడ్డి, రవి, రాకేష్, రాజశేఖర్, స్వామి, భూమయ్య, నరేష్, రవి, అశోక్, గ్రామస్తులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad