Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలభైరవుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

కాలభైరవుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని ఇస్సన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు దర్శించుకున్నారు. వారికి శాలువాతో సన్మానించి ,స్వామి వారి జ్ఞాపకను , తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ, భక్త బృందం, గ్రామస్తులు స్వామివారి జన్మదిన పురస్కరించుకొని జరిగే వేడుకల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రతి ఒకరు సహాయ సహకారాలు అందించాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానం చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు రాంచంద్రం తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -