- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దేవదాయ భూముల రక్షణకు సర్కార్ చర్యలు చేపట్టనుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సెక్షన్ 83, 84 తొలగించాలని భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు, భవనాల ఆక్రమణలు జరిగినట్లు గుర్తించగా.. వాటిని వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. పోలీస్, హైడ్రా సాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేస్తున్నలు తెలుస్తోంది.
- Advertisement -



