Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సాధికారతలో ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

మహిళా సాధికారతలో ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

మేకల రాధ సర్పంచ్ చల్వాయి గ్రామపంచాయతీ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

మహిళ సాధికారతలో ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ రాధా నవ తెలంగాణతో మాట్లాడారు. ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా మండల ప్రజానీకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు ఆర్థిక పురోగతిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందని, అవసర నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం, రేషన్ కార్డు లు ఇందిరమ్మ గృహాలు మహిళల పేరు మీదనే ఇస్తూ మహిళ ప్రగతికి దోహదం చేస్తున్నారని తెలిపారు. ప్రతి రంగంలో నూ ప్రభుత్వ మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ మహిళా సాధికారతను చాటిచెప్పుతోందని పేర్కొన్నారు. చరిత్రలో మహిళలకు ఒక ప్రముఖ ప్రాధాన్యత ఉందని భవిష్యత్తులో కూడా అన్ని రంగాలలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -