- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోవడానికి సెక్యూరిటీ బాండ్లను రిలీజ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 13న నిర్వహించనున్న ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది. 21 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 22 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 25 ఏళ్ల కాల పరిమితితో రూ.900 కోట్ల చొప్పున రుణాన్ని సేకరించనుంది. తెలంగాణ సహా దేశంలోని 7 రాష్ట్రాలు రూ.11,500 కోట్ల మేర రుణాలు తీసుకోనున్నాయి.
- Advertisement -