– గ్రామ సభల్లో అయా గ్రామాల సర్పంచులు
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాడానికి శాయశక్తుల కృషి చేస్తామని మండలంలోని అయా గ్రామాల సర్పంచులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యచరణలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై గురువారం మండల వ్యాప్తంగా గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.ఎంపీడీఓ ప్రవీన్,అయా గ్రామాల సర్పంచులు,అయా శాఖల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,ప్రజలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో వివక్ష :సీపీఐ(ఎం)
ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమల్లో వివక్ష స్పష్టమవుతుందని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు.గురువారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో సీపీఐ(ఎం)పార్టీ పక్షాన గ్రామంలో నెలకొన్న సమస్యలు,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న తీరుపై శ్రీనివాస్ గళమెత్తారు.ఇందిరమ్మ ఇళ్లను అర్హులందరికి అందించాలని ఎంపీడీఓ ప్రవీన్ ను కోరారు.



