Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి

- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదిరెడ్డి ముకుందా రెడ్డి 
నవతెలంగాణ – బొమ్మలరామారం 
: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రజాపాలనతోనే సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదిరెడ్డి ముకుందా రెడ్డి అన్నారం. ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అనే సుక్తిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నిజం చేసి చూపించారు. ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ అందజేశారు. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబాలకు ఆపద్బాంధవుడై ఆదుకున్నారు. పెండ్లిలకు ఆర్థిక సాయం చేసి తోడున్నారు. బొమ్మలరామారం మండలంలోని పలు గ్రామాలలో రోడ్డు రవాణా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్పందించి ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా అంబులెన్స్ సేవలు ఆలేరు నియోజకవర్గంలోని ప్రజలు వైద్యానికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం కొరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ లు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నాయి. ఇంత చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి బహుమతి ఇవ్వాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img