- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు
క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని ఆత్మకూరు మండల కేంద్రంలోని చర్చిలో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి మాట్లాడారు.
ఆలేరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారని,ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమం,అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య క్రిస్టియన్ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



