Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పల్లెనిద్రకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

పల్లెనిద్రకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వర్టూరు గ్రామంలో 9వ తేదీ  సాయంత్రం 7:00 గంటలకు దళితవాడలో పల్లెనిద్ర సహపంక్తి భోజనం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. గ్రామ దళితవాడలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసి వారితో పాటు సహపంక్తి భోజనం చేసి, అక్కడే రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు.

మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ వరుటూరు గ్రామంలో పల్లెనిద్ర చేసి, పొద్దున్నే లేచి ఆర్భాటంగా వర్టూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని వాగ్దానం చేసి వెళ్లిపోయాడు. పదేళ్లు గడిచినా.. ఆ ఊరుకు ఒక్క ఇల్లు రాలేదు. కెసిఆర్ మాటలు నీటి మీది రాతలు అన్నారు.

మంగళవారం రాత్రి ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారి ఇళ్లకు బుధవారం రోజు ఉదయం వర్టూరు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా ముగ్గు పోసి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆలేరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు అధికారులు కలెక్టర్ చేసిన కృషి వల్ల మొదటి స్థానం దక్కిందన్నారు. గత సంవత్సరం చెరువులు నింపి బీర్ల ఐలయ్య పేరు నీళ్ల అయిలయ్యగా ప్రజలు కీర్తించారు. ఇప్పుడు ఇండ్ల ఐలయ్యగా రాష్ట్రవ్యాప్తంగా పేరు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆలేరును అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తేవడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad