Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నూతన సంవత్సర సందర్భంగా గురువారం ఆలేరు కురుమ సంఘం నాయకుల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన క్యాలెండర్ ఇయర్ లో ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా రోజు వ్యాయాయం ఆకుకూరలు పండ్లు లాంటి పదార్థాల భోజనంలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అన్నిటికన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.క్యాలెండర్ ప్రింట్ చేయించిన సిద్దు కన్స్ట్రక్షన్ & డెవలప్మెంట్స్ నిర్వాహకులు పరిష గణేష్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గిడి శ్రీశైలం బీసీ సంఘం నాయకులు పేరపు రాములు, మంగ నరసింహులు, కూళ్ల నర్సింలు, కుల్ల సిద్ధులు, మంగ సత్యనారాయణ, బండ పర్వతాలు, పిక్క శ్రీను, పేరపు శ్రీశైలం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -