నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు రైల్వే గేటు వద్ద గల వెంకటేశ్వర వైన్స్ షాపు ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగడం ఆరోగ్యం హానికరం అయినప్పటికీ ప్రభుత్వ మద్యం లేకుంటే ప్రజలు గుడుంబా నాటు సారా అలవాటు పడతారని అది మరింత ప్రమాదమని అన్నారు.మద్యం అలవాటును ప్రజలు క్రమక్రమంగా మానుకోవాలని సూచించారు.వివిధ బ్రాండ్ల మధ్య ధరలను అడిగి తెలుసుకున్నారు.సిట్టింగ్ రూమ్ పరిశుభ్రత ను పరిశీలించారు.తినుబండారాలను తాజాగా ఉన్నాయా లేదో చూశారు.నెల రోజుల క్రితం వైస్ టెండర్లలో నూతనంగా లక్కీ డ్రా ద్వారా వైన్స్ లను సొంతం చేసుకున్న ఆలేరు లోని వెంకటేశ్వర వైన్స్ వంగపల్లిలోని సమ్మక్క సారక్క వైన్స్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.వీరితోపాటు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం,వంగపల్లి మాజీ సర్పంచ్ కానుగంటి బాలరాజు,బహుదూర్ పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వట్టిపల్లి శ్రీనుకురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గిడి శ్రీశైలం,గౌడ సంఘం నాయకులు దూడల చంద్రమౌళి, ఘణగాని ఆనంద్, మొరిగాడి మహేష్, మొరిగాడి మౌర్య, ఎగ్గిడి విద్యాసాగర్, కొమ్మ గాని మహేష్, పంజాల వెంకటేష్,బోనాల రవిశంకర్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ విప్ ను శాలువాలతో సన్మానించారు.
వెంకటేశ్వర వైన్స్ సందర్శించిన ప్రభుత్వ విప్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



