నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
తెలంగాణ ప్రభుత్వం మత్స్య మత్స్య కారుల సంక్షేమానికి కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని సంగాల చెరువులో ఆదివారం మత్స్య కారులకు ఉచితంగా చేపల పిల్లలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సంగాల చెరువు, రిజర్వాయర్ లో 2 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. తెలంగాణ ప్రభుత్వం వందశాతం రాయితీ పై మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా చేసిందన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మిగిలిన రాష్ర్టాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నదులు, సముద్రాల శాతం తక్కువ అని అయినా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుని చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అన్ని చెరువులను అభివృద్ధి చేసి చేపపిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.
మత్స్యకారులు రంగంపై ఆధారపడి జీవితానికి కుటుంబాలకు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులు కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మత్స్యకారుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి గద్వాల మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప , మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ , మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్స్ శ్రీను ముదిరాజ్, పూడూరు కృష్ణ , నరహరి గౌడ్, శ్రీమన్నారాయణ, నాయకులు రిజ్వాన్, నాగులు యాదవ్ సుదర్శన్, యుగంధర్ గౌడ్, ధర్మ నాయుడు, మోబిన్, సంగాల నర్సింహులు, రామాంజనేయులు నాగేంద్ర , దౌలన్న లక్ష్మన్న, గాంధీ, గువ్వల గోపాల్ , రాజు మౌలిల్ ,మత్స్యకారుల జిల్లా అధికారి, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు వెంకట్ రాములు పాల్గొన్నారు.



