– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నాం..: రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
– గద్వాలలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు
– వనపర్తి జిల్లా మంగంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల/ వనపర్తి
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో పేద ప్రజల అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారం పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం గద్వాల పట్టణ సమీపంలోని దర్పల్లి దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమాల్లో పొంగులేటితోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, కలెక్టర్లు బిఎం.సంతోష్, ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. గత పదేండ్ల కాలంలో పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచన ఆ ప్రభుత్వానికి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికీ 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికీ ఒక జీపీఓ కేటాయించామని, మండలానికి 20 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించామని తెలిపారు. రాష్ట్రంపై ఇన్ని అప్పులు ఉన్నా ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని ఎక్కడా ఆపకుండా పనిచేస్తున్నామని చెప్పారు.
సంక్షేమ పథకాలు ఆగొద్దని..
ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేదల సంక్షేమ పథకాలు ఆగొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తుంటే.. ప్రతి నిరుపేదకూ ఇందిరమ్మ ఇల్లు అందాలనే లక్ష్యంతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పని చేస్తున్నారని ఎక్పైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. – ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు
విద్య ప్రతి ఒక్కరికీ అందాలని 22,500 కోట్లతో ప్రతి మండల కేంద్రంలోనూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నట్టు పశుసంవర్థక, మత్స్య, యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
-పశుసంవర్థక, మత్స్య,
యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES