సీసీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో
సీసీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలో వివిధ గ్రామాల్లో వున్న రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సీసీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపెల్లి సైదులు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కొద్దిసేపు బయట ఇచ్చే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా బస్తాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
రైతాంగం వరి మొక్కజొన్న పత్తి రకరకాల పంటలు వేసుకొని యూరియా కోసం రైతాంగం అనేక అవస్థలు పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నిమ్మకు నిరేత్తనట్లు గా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రామానికి ఒక రెండు లోడులను కలిపి ఒక్కొక్క గ్రామానికి కనీసం ఒక్క లారీ చొప్పున యూరియా బస్తాలు వస్తే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో బస్తాలు పంపిణీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సీసీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపెల్లి సైదులు ఆరోపించారు. నాయకులు భూక్య బిక్షపతి బొల్లం ఎల్లయ్య బాలాజీ మల్లేశు ఇసంపెల్లి శ్రీనివాస్ వాల్యా తదితరులు రైతులు పాల్గొన్నారు.
రైతులకు యూరియా బస్తాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES