Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వంశీకృష్ణ 

మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వంశీకృష్ణ 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
తెలంగాణ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత లో భాగంగా మహిళలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ పథకం మహిళల ఉన్నతి కోసం ఉద్దేశించబడిందని అన్నారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని దానిని కొనసాగిస్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డనూ తోబుట్టువుగా భావించి చీరల పంపిణీ చేస్తున్నదని అన్నారు. 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆమె స్ఫూర్తితోనే మహిళలకు రిజర్వేషన్లు, జీరో వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ మరియు వితంతువులు, వృద్ధాప్య మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అధికారి రాజేశ్వరి, మండల ఏపీఎం పార్వతి, తహసిల్దార్ శ్రీకాంత్, నాయకులు  వెంకటరెడ్డి, ఖదీర్, కాశన్న యాదవ్, మహిళా సంఘాల లీడర్లు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -