పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు సకల సౌకర్యాలతోపాటు వారికి గౌరవం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం మండల కేంద్రమైన తాడిచర్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మండలంలో తాడిచర్ల ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. రైతుల సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సహకార సంఘ కార్యాలయం, గోదాం భవనం, రూ.25 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం, రూ.7.80 లక్షలతో ఆర్ అండ్ బి రోడ్డు నుండి రైతు వేదిక వరకు నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు, రూ.3.5 లక్షలతో పిఎసిఎస్ వద్ద నిర్మించనున్న ఆర్చిగేట్ నిర్మాణ పనులకు, రూ.12 లక్షలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ ప్రహరి గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సహకార సంఘం కార్యాలయం ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకు సేవలు, వ్యవసాయ రుణాలు మంజూరు సులభతరం అవుతుందన్నారు.
బ్యాంకులో లాకర్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం.కసరత్తులు కృషి చేస్తుందన్నారు.జూనియర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రదానంగా బాలికలు పట్టణాలకు వెళ్లి ఉన్నత చదువుతున్నారని అభినందించారు.అధునాతన హంగులతో గ్రంథాలయం ఏర్పాటు ద్వారా విద్యార్థులకు, ప్రజలకు అవసరమైన పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ వనరులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లభించని వారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల నమోదు పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. తొమ్మిది రోజుల్లో రైతులకు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా అందించామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు చేపట్టామని వెల్లడించారు.ఈ కార్యక్రమాలల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,జిల్లా అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య,వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు, సహకార అధికారి వాలియా నాయక్,వ్యవసాయ అధికారి బాబూరావు, మహాదేవపూర్ ఏడీఏ శ్రీవ్యాల్, తహసీల్దార్ రవి కుమార్,ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,పిఏసిఎస్ డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,సంగ్గేం రమేష్,మంథని మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
రైతులకు సకల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES