Sunday, December 28, 2025
E-PAPER
Homeఖమ్మంగిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే ప్రభుత్వ సంకల్పం: ఎమ్మెల్యే

గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే ప్రభుత్వ సంకల్పం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం మే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. మండలంలోని కొండ రెడ్లు (పీవీ టీజీ)నివాసం ఉంటున్న పంచాయితీల్లో ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృద్ధి ఏజెన్సీ) ప్రత్యేక చొరవతో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల అర్హత పత్రాలను ఆదివారం వారికి అందజేసారు. అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం,తిరుమలకుంట, గాండ్లగూడెం,కావడిగుండ్ల పంచాయతీల్లో నివసిస్తున్న కొండ రెడ్ల ఆదివాసీలకు వీటిని అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కష్టాలు పడుతూ, అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న కొండ రెడ్ల కు సొంత ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆదివాసీలకు భద్రతతో పాటు మౌళిక సౌకర్యాలతో కూడిన జీవనం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.

ఆదివాసీలను అన్ని రంగాలలో ముందుంచేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ మహోన్నతంగా ప్రారంభించి ఏడాదికి ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించి కష్టకాలంలో పేద కుటుంబాలను ఆదుకున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇంత గొప్ప పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించటానికి ప్రధాన కారకులైన మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా చేపట్టిన చర్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించి యధావిధిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో అప్పారావు, పాతరెడ్డిగూడెం, తిరుములకుంట, గాండ్లగూడెం, కావడి గుండ్ల సర్పంచ్ లు ఉమ్మల వెంకటరమణ, కొర్స రాజేష్, మాలోత్ ఆలీ బాబు, బాడిస లక్ష్మణ్ రావు, పాలక వర్గం సభ్యులు, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, జేష్ఠ సత్యనారాయణ చౌదరి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -