నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించారు. వాడవాడలా వెలిసే గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించుకోవాలని కోరారు. గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలనీ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నదని చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజరు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు రాష్ట్ర ప్రజలకు తమ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES