Friday, May 9, 2025
Homeట్రెండింగ్ న్యూస్రెడ్ క్రాస్ భవన నిర్మాణ భూమి పూజకు గవర్నర్

రెడ్ క్రాస్ భవన నిర్మాణ భూమి పూజకు గవర్నర్

- Advertisement -


నవతెలంగాణ – సిరిసిల్ల: ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిది కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడానికి అంగీకరించారు.  ప్రపంచ రెడ్ క్రాస్ డే సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజభవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హేండ్రి డునంట్ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం కొరకు వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు కలెక్టర్ వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో  వేయి గజాల ప్రభుత్వ భూమిని ఇండియన్ క్రాస్ రక్తనిధి కేంద్రం కోసం కేటాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, సిరిసిల్ల జిల్లా కమిటీ అడ్వైజర్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గుడ్ల రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రయాకర్ రావు వేణు కుమార్ లు రక్త నిధి కేంద్రం భూమి పూజకు  రాష్ట్ర గవర్నర్ ని ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -