Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరిస్తా...

గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరిస్తా…

- Advertisement -

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్..
నవతెలంగాణ -జన్నారం

గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్భంగా  జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ .. బడుగు బలహీన వర్గాలకు రాజ్యధికారం కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయసాధన కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భారీ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

గౌడ కులస్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు.ఏజెన్సీ గ్రామమైన కవ్వాల్ లో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కవ్వాల్ గ్రామంలోని వాగు నుండి వచ్చే మత్తడి కాలువకు రానున్న వేసవిలో శాశ్వత మరమ్మతులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ గౌడ సంఘం అధ్యక్షులు కాసారపు పోచా గౌడ్, ఉపాధ్యక్షులు మేరుగు బాల గౌడ్, మండల గౌడ సంఘo అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ దుర్గం లక్ష్మినారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గర్వాందుల సత్యా గౌడ్, తిరుపతి, మాజీ ఎంపీపి మచ్చా శంకరయ్య, కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, శేష్ రావు, గౌడ సంఘo నాయకులు పరకాల తిరుపతి గౌడ్, పోడేటి మల్లేష్ గౌడ్, మూల నారాయణ గౌడ్, అంజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad