గదుల కొరతతో విద్యార్థులకు, గ్రామస్తులకు ఇబ్బందులు
నవతెలంగాణ – రామారెడ్డి
తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం తాండవాసులకు సంతోషాన్ని కలిగించిన, గ్రామపంచాయతీ నిర్వహణకు పక్కా భవనం లేకపోవడంతో గ్రామస్తులు, అధికారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలోని పట్టుతాండాలో గ్రామపంచాయతీ కార్యాలయం మండల పరిషత్ పాఠశాల ఆవరణలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు రెండే రూములు ఉండడంతో, విద్యార్థులకు చెట్ల క్రింద, గ్రామపంచాయతీ భవనంలో ఎవరు లేనప్పుడు విద్యను ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. గ్రామపంచాయతీకి సమస్యల పరిష్కారానికి వస్తున్న తాండవాసులతో విద్యార్థులకు, విద్యా బోధనతో గ్రామపంచాయతీ అధికారులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ పక్క భవనాలను మంజూరు చేయాలని తాండవాసులు కోరుతున్నారు.
ఒకే గదిలో జీపీ.. బడి నిర్వహణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES