- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : డోంగ్లి మండలంలోని మొగా గ్రామంలో గురువారం నాడు ఆ గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సాధారణ సమావేశంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్చించడం జరిగిందని ఆ గ్రామ కార్యదర్శి ఆ గ్రామ సర్పంచ్ తెలియజేశారు. గ్రామంలో ముఖ్యంగా త్రాగునీటి సమస్య వీధిలైట్ల ఏర్పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి పాలకవర్గం చర్చించడం జరిగిందని వారు తెలిపారు.
- Advertisement -



