Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్యాలయాలు ముస్తాబు.!

జీపీ కార్యాలయాలు ముస్తాబు.!

- Advertisement -

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు సోమవారం కొలువదీరనున్నాయి. దీంతో మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, దుబ్బపేట, ఇప్పలపల్లి, కొండంపేట, కొయ్యుర్, ఎడ్లపల్లి, రుద్రారం, చిన్నతూండ్ల తోపాటు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి ఫండ్ను కేటాయించనప్పటికీ కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలోని జనరల్ ఫండ్స్ ద్వారా, మరికొన్ని చోట్ల నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు తమ సొంత నిధులతో క్లినింగ్, ఫ్యాన్లు, లైట్ల రిపేర్ పనులు చేపట్టారు.

రెండేండ్లుగా పాలకవర్గం లేక నిరాదరణకు గురైయ్యాయి. ఇప్పటివరకు అరకొరగా చేపట్టిన శానిటేషన్ పనులను సిబ్బంది వేగం పెంచారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని ప్రతి వీధిని శుభ్రం చేయడంతో పాటు వీధుల వెంట ఉన్న మురుగు నీటి నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. అధికారులు ప్రమాణ స్వీకారానికి కావాల్సిన పత్రాలను, ఇతర ఏర్పాట్లను ఒక రోజు ముందే రెడీ చేసుకున్నారు.

ప్రమాణ స్వీకరణ బాధ్యత..
నూతన కమిటీల ప్రమాణ స్వీకార బాధ్యతను ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకే అప్పగించారు. స్పెషల్ ఆఫీసర్లుగా పలు శాఖల అధికారులు కొనసాగుతున్నారు. వారి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -