Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీఓ

జీపీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరకాల మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు సూచించారు. వాతావరణ పరిస్థితుల రీత్యా ఎప్పటి కప్పుడు మోరీలు శుభ్రం చేయడం, నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడం సాయంత్రం ఫాగింగ్ చేయాలని  ఎంపీడీవో ఆదేశించారు.

వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని మండల వైద్యాధికారిని కోరారు. వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాలలో పాత గోడలు కూలడం ఇతరత్రా కారణాల వల్ల ప్రమాదాలు ఏర్పడితే వెంటనే తహసీల్దార్ లేదా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -