నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మోత్కూర్ మండలం పాలడుగు పంచాయతీ కార్యదర్శిని, గిర్దావర్ని సస్పెండ్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. కల్యాణలక్ష్మి చెక్ అనర్హులకు ఇవ్వటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి రాగానే వెంటనే విచారణ జరిపించాలని భువనగిరి ఆర్డీఓకి ఆదేశాలు జారీచేశారు. తహసీల్దార్, ఆర్డీఓ నివేదికల ప్రకారం కనీసం సమగ్ర విచారణ జరపకుండా కల్యాణలక్ష్మి మంజూరికి కారణం అయ్యారని, వారి నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శిని గిర్దావర్ ని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వారిని సహించేది లేదని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.