- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రేపు సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం ఏడు గంటల 15 నిమిషాలకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అధికారులు, పాత్రికేయులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా కోరారు. కాగా ఇప్పటికే పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- Advertisement -



