Monday, July 7, 2025
E-PAPER
HomeNewsజీపీ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలి

జీపీ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలి

- Advertisement -

బకాయి వేతనాలను చెల్లించుకుంటే పోరాటాలను ఉదృతం చేస్తాం
సిటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: 2వ పిఆర్సి వర్తింపచేయాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్సన్ వర్కర్ విధానం రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శిను డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులందరికీ రూ.10 లక్షల ఇన్సూరెన్సు బీమా పథకాన్ని తక్షణమే నమోదు చేయించాలని, గ్రామపంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను చెల్లించాలని బకాయిల వేతనాలను చెల్లించుకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా గ్రామపంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలు, సబ్బులు కొబ్బరి నూనె బ్లౌజెస్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు 5 నుంచి 6 నెలలు వరకు వేతనాలను ప్రభుత్వం చెల్లించకపోవడం సరైంది కాదని అన్నారు. కార్మికులు ఏం తిని బతకాలి ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయితీలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె పకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. దీనివల్ల సిబ్బంది రోగాల బారిన పడుతున్నారని తెలిపారున. వీరిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాలకు చెందిన పేద కార్మికులు అధికంగా ఉన్నారని తెలిపారు.

సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా నేటికీ పనిభద్రత, ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదని అన్నారు. పారిశుద్ద్య పనులు చేస్తూ.. అనేక మంది పంచాయతీ కార్మికులు మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించడం లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లతో బీమా పథకాన్ని చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మీ గంగారం సాయిలు జిల్లా గంగాధర్ గణేష్, వంశీ రమేష్ హకీమ్ అనురాధ విజయ, గంగమ్మ, యూనియన్ జిల్లా నాయకులు మెనూ కుమార్,  రంజిత్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -