Friday, September 19, 2025
E-PAPER
Homeఖమ్మంజీపీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

జీపీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

– సీఐటీయూ నాయకులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట

గ్రామపంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని,జీపీ కార్మికులను రెండవ పీఆర్సీ పరిధిలోకి తీసుకువచ్చి వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో అప్పారావు కు అందజేశారు. 

ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు గ్రామపంచాయతీ కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలేదని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామాలలో సర్వం తానై ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తుంటే వేతనాలు మాత్రం మూడు,నాలుగు నెలలు పెండింగ్లో పెట్టి కార్మికులను పస్తులతో ఉంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.కార్మికుల పిల్లలకు స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయి లు కట్టుకోలేక పోతున్నారని,పూట గడవడం కోసం అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు.

ఎన్నికల హామీలు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు తాము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం,గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని వాగ్దానాలు చేశారని,కానీ అవి ఏవి అమలు కావటం లేదని అన్నారు.వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని,ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని,పీఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా, గ్రాట్యుటీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ అధ్యక్షులు వెంకటప్పయ్య, కార్యదర్శి వినోద్, నాయకులు ముత్తా రావు,రామారావు, మహేష్,వెంకయ్య,విజయ్, కన్నారావు,రాజు, సీతారాములు,మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -