నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు విడుదల చేసి, ఉద్యోగ భద్రత, పర్మినెన్సీ, పిఎఫ్-ఈఎస్‌ఐ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలనీ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు,ఎం రాంబాబు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమపంగు రాధాకృష్ణ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటియు అనుబంధం సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పంచాయతీ సిబ్బంది, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి అని అన్నారు.
పంచాయతీ సిబ్బందిని 2 వ పి ఆర్ సి పరిధిలోకి తీసుకోవచ్చు జి ఓ51 అమలు చేసి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు పరిచి పాత కేటగిరీలను కొనసాగించాలి అని అన్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలీ అన్నారు.డ్యూటీ సమయంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ భద్రత కల్పించి మరణించిన కార్మికుల దహన సంస్కార ఖర్చు రూ.10,000/- నుండి రూ.20,000/-కు పెంచాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా కార్యదర్శి చెరుకు యకలక్ష్మీ, యల్క సోమయ్య గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ఎం. ముత్యాలు, వట్టేపు సైదులు, సాయికుమార్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల రవిచంద్ర, ఉపాధ్యక్షులు వెంకన్న గౌడ్, ఎస్.కె. గౌస్, మహిళా కన్వీనర్ గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.