సీఐటీయూ మండల అధ్యక్షుడు మాదర గంగారం..
మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పిల్లి
గత మూడు నెలలుగా పనులను చేయించుకుని ఇప్పటివరకు వేతనాలు ఎవరిదని తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇందల్ వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావుకు సమస్యలతో కూడిన పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఇందల్ వాయి మండల అధ్యక్షులు మాదరి గంగారం మాట్లాడుతూ .. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని, కార్మికులందరిక పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూనే ఈఎస్ఐ పి సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం రూ.20 వేలు ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికునికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, బతుకమ్మ దసరా పండుగలకు రెండు జతల దుస్తులను ,చెప్పులను, కొబ్బరినునె చేతులకు గ్లోజులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని లేని ఎడల సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తలారి రాజు, సంజీవ్, మల్లయ్య, నగేష్, అశోక్, అశన్న,గంగమని , నర్సయ్య తో పాటు ఆయా గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.