- Advertisement -
- – మండలంలో 10మంది ఎంపిక
నవతెలంగాణ – మల్హర్ రావు: గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గ్రామ పాలనాధికారులను (జీపీఓ)లను నియమిస్తోంది. వీఆర్ఎ, వీఆర్ ఓ వ్యవస్థలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2022లో రద్దు చేసి అర్హత ఆధారంగా పలు శాఖలలో వివిధ పోస్టులలో భర్తీ చేశారు. అనంతరం ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఎ, వీఆర్ఓల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హత పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు.ఈ మేరకు జిల్లాలో 107 మంది, మండల వ్యాప్తంగా 10 మంది ఎంపికవ్వగా..వీరందరూ మాదాపూర్ లోని హైటెక్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాలు అందుకోన్నారు.దాదాపు 5వేల ఎకరాల భూ విస్తీర్ణం ప్రకారం క్లస్టర్లుగా విభజించారు.మండలంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్కు ఒక్కో జీపీఓను నియమించనున్నారు. ఈ క్రమంలోనే మండలం నుంచి 10 జీపీఓలుగా ఎంపికయ్యారు. రెవెన్యూ ఉద్యోగులను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవడంతో ఆశాఖలో ఇబ్బందులు తొలగనున్నాయి.
- Advertisement -