Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వాత్సల్య ఫార్మసీ కళాశాలలో స్నాతకోత్సవ వేడుకలు

ఘనంగా వాత్సల్య ఫార్మసీ కళాశాలలో స్నాతకోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో గల వాత్సల్య ఫార్మసీ కళాశాలలో కాన్వకేషన్ డే ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వాత్సల్య ఫార్మసీ కళాశాల ఫౌండర్ దరిపల్లి అనంతరాములు  చిత్రపటానికి  నివాళులర్పించారు.  ఈ సందర్భంగా  వాత్సల్య కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్,  కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ కాన్వకేషన్ డే సందర్భంగా వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ వాత్సల్య లో విద్యను అభ్యసించిన విద్యార్థినీ విద్యార్థులు వారి చదువుతోపాటు ఫార్మసీ రంగంలో నిర్వహిస్తున్న వివిధ ఫార్మా ఫెస్ట్ లలో పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లలో పాల్గొనాలని అన్నారు. 

విద్యార్థిని విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని అన్నారు. బీఫార్మసీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఎంటర్ప్రైనేరుగా ఎదగాలని, వారి ఉపాధి పొందుతూ పలువురికి ఉపాధి కల్పించాలని, ఫార్మా కంపెనీలు స్థాపించాలని, అంతేకాక నూతన ఫార్మాడ్రగ్స్ ని కనిపెట్టాలని అన్నారు. ప్రపంచాన్ని వనికించిన కోవిడ్ మహమ్మారి నుండి మానవాళిని కాపాడడానికి మొట్టమొదటిగా వ్యాక్సిన్ కనిపెట్టింది భారత్ బయోటెక్ మన భారత ఫార్మసిస్టులే అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ ఇప్పుడు ఫార్మా హబ్ గా ఉన్నదని చెప్పి అన్నారు.

బీఫార్మసీ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నారు.  విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడంలో మా కళాశాల ఎప్పటికీ ముందుంటుందని,  ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్ , జాబ్ మేళాలను నిర్వహించి విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నామని అన్నారు.  అనంతరం  యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు బీఫార్మసీ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్  పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు,  విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -