Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్కిడ్స్ హై స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ఆర్కిడ్స్ హై స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ఆర్కిడ్స్ హై స్కూల్‌లో యు కె జి  విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు  వైభవంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వేడుకను మరింత విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఆత్మీయ స్వాగతంతో ప్రారంభమై, చిన్నారుల అందమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ చి. గోవర్ధన్ రెడ్డి  సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవసరమని, విద్యతో పాటు విలువలూ ఎంతో ముఖ్యమని తెలియజేశారు. అనంతరం ఆయన యూకేజీ  విద్యార్థులకు కన్వొకేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఎం. సదాశివ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎం. భూలక్ష్మి,, డైరెక్టర్ చి. వసంత లు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పిల్లలను ప్రేమతో, ఓర్పుతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తల్లిదండ్రులు  పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ పిల్లలకు మంచి విద్యా వాతావరణం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆనందభరిత వాతావరణంలో ముగిశాయి. చిన్నారుల విద్యా జీవితంలో ఇది ఒక కొత్త ఆరంభంగా నిలిచింది. ఆర్కిడ్స్ హై స్కూల్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -