Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలుధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
    నవతెలంగాణ-రాయపర్తి
    ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం మండలంలోని కొండూరు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కొండూరు, ఉకల్ గ్రామాల్లో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ ఉండాలన్నారు. టోకేన్ ప్రకారం కాంటాలు పెట్టాలని, చెల్లింపులు రైతులకు జరిగేలా చూసుకోవాలి అన్నారు. రైతులకు నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించాలన్నారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొంటుందని భరోసా కల్పించారు. పంట నష్టంపై అంచనాలు వేయడానికి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం తప్పక అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఆమెతో పాటు ఎఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి వీరభద్రం, ఎంపిఓ రవీందర్, ఇరిగేషన్ ఏఈ బాలదాసు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -