నవతెలంగాణ – రాయపర్తి : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాయపర్తి పీఏ సీఎస్ సిఈఓ ఎడాకుల సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం సొసైటీ ఆధ్వర్యంలో రాయపర్తి, గన్నారం, ఉకల్, ఏకే తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మిమోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగు నీరు, నిలువ నీడ, టార్పాలిన్ కవర్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అందిస్తున్న మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది ఐత మల్లేష్, రాకేష్ , హమాలీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.