- Advertisement -
తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
జనగణన-2027లో భాగంగా మొదటి దశలో ఇండ్ల గణన సోమవారం నుండి జూన్ 9 వరకు కొనసాగుతుందని ఇందుకు ప్రజలు అధికారులకు సహకరిస్తూ పూర్తి సమాచారం ఇవ్వాలని మండల తహశీల్దార్ రవికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇండ్ల గణనకి సంబంధించి ఉపాధ్యాయులు గణకులుగా మండలంలోని ఆయా గ్రామాల్లోని నివాస యోగ్యమైన,నివాస యోగ్యం కాని ప్రతీ ఇంటిని,పాఠశాలలను,హాస్టల్స్ ని, వాణిజ్య పరమైన ఇండ్లను కూడా సందర్శించి గణన చేస్తారని తెలిపారు.ఇంటికి వచ్చిన ఉపాధ్యాయులకి సహకరించి ఇండ్ల గణనకి సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరారు.
- Advertisement -



