– మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ
నవతెలంగాణ-సత్తుపల్లి
సమాజంలో అన్ని వర్గాల ప్రజల గొంతుకగా ‘నవతెలంగాణ’ దినపత్రిక తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ అన్నారు. ‘నవతెలంగాణ’కు ఆయన 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వామపక్ష భావజాలంతో స్థాపించబడిన ఈ పత్రిక ప్రజల సమస్యలను వెలికి తీసి వాటి పరిష్కారం కోసం నిరంతరంగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తోందని కమిషనర్ నరసింహ స్పష్టం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పత్రికా పోటీ రంగంలో నవతెలంగాణ తన ప్రత్యేక ముద్రను తన కథనాల ద్వారా చాటుకుంటోందని ఆయన అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆయన పత్రిక యాజమాన్యానికి, ఎడిటోరియల్ సిబ్బందికి, పాత్రికేయులకు, పత్రిక నిర్వహణ బాధ్యులకు ఈ సందర్భంగా కమిషనర్ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు.
సమాజంలో ప్రజా గొంతుకగా ‘నవతెలంగాణ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



