Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

- Advertisement -

భద్రతా చర్యలు తప్పనిసరి…మండపాల నిర్వాహకులకు అధికారుల సూచనలు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మండపాల నిర్వాహకులతో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు,యాదగిరిగుట్ట సీఐ శంకర్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్, ఎమ్మార్వో ఆంజనేయులు,ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్,ఎస్‌ఐ వినయ్ కుమార్,ఫైర్ అధికారి హమీద్ మాట్లాడారు.గణేష్ మండపాల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు సూచించారు.

మండపాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు, విద్యుత్‌ భద్రతా చర్యలు చేపట్టాలని,ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.పోలీసులు, రెవెన్యూ,పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో మండపాల నిర్వాహకులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.మంటపాల వద్ద డీజెలు నిషేధమని నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని వివరించారుఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు,గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు,గణేష్ యూత్ సభ్యులు,మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -