నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన ప్రాజెక్టు గ్రామ పంచాయతీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ఏకీకృతం చేసి, అమలు చేసే దిశగా పనిచేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు శాఖలను ఆదేశించారు. సమీకృత వాతావరణం మార్పులను తట్టుకోగల అభివృద్ధి చర్యలతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. FAO & IOM MMPTF-JP సంయుక్తంగా అమలు చేస్తున్న గ్రామాలు పంచాయతీలు వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక తయారీపై NIRD- PR వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు. డాక్టర్ నిత్య డాక్టర్ సుజిత్ డాక్టర్ సాహూ అభివృద్ధి క్షేత్ర పర్యటనలు మహిళా సభ సంప్రదింపుల ద్వారా రూపొందించిన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలను, వాతావరణ మార్పులను తట్టుకోగల స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలను సమర్పించారు.

వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అనుసంధానించడం ద్వారా ఈ ప్రణాళికను గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో ఎలా ఏకీకృతం చేయవచ్చు వారు వివరించారు. FAO కు చెందిన వంశీధర్ MMPTF-JP సంయుక్తంగా కార్యక్రమ లక్ష్యాలను గురించి వివరించారు. గ్రామీణ జీవనోపాధి బలోపితం చేయవలసిన అవసరాన్ని వివరించారు. స్థానిక రైతులు పండించిన పప్పు ధాన్యాలు నవార బియ్యం సమీకరణ సమూహిక మార్కెటింగ్ సులభతరం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. వర్క్ షాప్ లో జిల్లా వ్యవసాయ అధికారి DRDO జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వ్యవసాయ ఉద్యానవన గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కర్యక్రామములో ధర్పల్లి మండల్ హోనాజీపేట్ దుబ్బాక ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు గ్రామపంచాయతీ సెక్రటరీలు మండల MPDO లు IKP APM లు , CCA లు సిరికొండ మండలంలో ని న్యావనంది మైలారం ప్రజా ప్రతినిధులు సర్పంచ్ గ్రామపంచాయతీ సెక్రటరీలు మండల MPDO, APM .CCA లు పాల్గొన్నారు.



