హెల్ప్ పేజీ ఇండియాకు 34,867 విరాళాలు అందజేసిన చిన్నారులు..
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
పిల్లలే కానీ ద్రాతృత్వంలో పెద్దలని, పెద్ద మనసున్న చిన్నారులు తార్నాక బచ్ పన్ ప్లే స్కూల్ విద్యార్థులు నిరూపించుకున్నారు. శుక్రవారం విద్యార్థులు హెల్ప్ పేజీ ఇండియా సంస్థ వారికి రూ.34,867 విరాళాల రూపంలో సేకరించి వారికి అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. 1వ, తరగతి నుండి 4వ, తరగతి విద్యార్థులు ఇలా చేయడం పట్ల కళాశాల డైరెక్టర్ ఎం వి ఎస్ డి. ప్రసాద్ వారిని అభినందించారు. బాల్యం నుండే చిన్నారులకు సామాజిక స్పృహతో పాటుగా దాతృత్వం లక్షణాల అవసరం ఉందన్నారు.
దానిపై వారికి అవగాహనకై ఈ విరాళాల సేకరణ కార్యక్రమం వారి ద్వారా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ మొత్తాన్ని హెల్ప్ పేజీ ఇండియా సంస్థ వారికి అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్, బహుమతులు, అందజేసి వారి కృషిని చిన్నారుల, ప్రయత్నాన్ని అభినందించి కురిపించారు. చిన్నారులు ఇలా ముందుకొచ్చి విరాళాలు సేకరించి తమ సంస్థకు అందజేయటం అభినందనీయమని వారిని హెల్ప్ పేజ్ ఇండియా ప్రతినిధులు ఆశీర్వదించారు. అదేవిధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



