Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్య రహిత సమాజం కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి

మాదకద్రవ్య రహిత సమాజం కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి

- Advertisement -

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) తన అన్ని అధ్యయన కేంద్రాల్లో “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ – సంకల్ప్ అభియాన్ ప్రతిజ్ఞ” అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లందరికీ తెలంగాణ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుండి అందిన ఆదేశాల మేరకు ఈ ప్రచారాన్ని విజయవంతంగా అమలు చేయాలని రిజిస్ట్రార్ డా. ఎల్వేకే రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడం, అందులో భాగంగా “నషా ముక్త్ యువా” ప్రచారం ద్వారా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.


అధ్యాపకులు, సిబ్బంది అధికారిక మై భారత్ పోర్టల్ ద్వారా 02 ఆగస్టు 2026 లోపు https://mybharat.gov.in/events/nasha_mukt_yuva లింక్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత ప్రతిజ్ఞ అనంతరం సర్టిఫికేట్ కూడా వెంటనే పొందొచ్చని సూచించారు. ఈ వివరాలను విద్యార్థులు BRAOU వెబ్‌సైట్: http://www.braou.ac.in లో కూడా పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి అన్ని అధ్యయన కేంద్రాలకు సమాచారాన్ని పంపించినట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం, డైరెక్టర్ లు, అన్ని విభాగాల శాఖాధిపతులు, రీజినల్ సెంటర్ల కో డైరెక్టర్లు, అధ్యయన కేంద్రాల కో ఆర్డినేటర్లు కూడా ఇందులో పాల్గొని గడువులోపు ఎక్కువ మంది విద్యార్ధులు ఆన్లైన్లో నమోదు చేసుకొని దేశంలో డ్రగ్స్ లేకుండా పారదోలుతామని, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేయాలని రిజిస్ట్రార్ డా. ఎల్వేకే రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -