నవతెలంగాణ-హైదరాబాద్: చెపాక్ వేదికగా లక్నో వారియర్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో..ఇంగ్లిస్ దూకుడుగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 85 పరుగులు చేసి భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే ఇంగ్లిస్ ఔట్ తో ఒక్కసారిగా స్కోర్ నెమ్మదించింది. మార్కరమ్(06) రనౌట్ కాగా, పంత్(15), మార్ష(10), స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. పూరన్ ఒక్క రన్‌కే ఔట్ అయ్యారు. చివర్లో షాంబాజ్(43), హిమ్మత్ సింగ్(17) ఇన్నింగ్స్‌ను నడిపించారు. చివరి ఓవర్లో ఫోర్లు, సిక్స్ బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సీఎస్కే బౌలర్లు ఓవర్టన్ 3, కాంబోజ్ 2, నూర్ ఒక వికెట్ తీశారు.
లక్నో వారియర్స్ భారీ స్కోర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



