Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకూబ్
నవతెలంగాణ-నెల్లికుదురు

జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యండి యాకూబ్ అన్నాడు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం మండల సంగం నాయకుడు బాణాల యాకయ్య అధ్యక్షతన ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల కుటుంబాలు కూలి మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు అనేక మంది ఉన్నారని అన్నారు. వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూములు అనేక వందల ఎకరాల భూములు అక్రమణకు గురవుతున్నాయని అక్రమనకు గురైన భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీన పరుచుకొని పేదలకు పెంచాలని కోరారు. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మికులకు పెన్షన్స్ సౌకర్యం కూలి బందు వాటిని వెంటనే అమలు చేయాలని పేద రైతుల భూములకు పట్టాలు లేని వారు చాలామంది ఇబ్బందులు పడుతున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని ఉపాధి కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఇసంపేల్లి సైదులు. మండల నాయకులు తోట నరసయ్య పి. పుల్లయ్య బొల్లం ఎల్లయ్య వెంకటమ్మ పాషా మారపాక వెంకన్న భూక్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -