Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవికుమార్  పటేల్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గుండూరు లో బీఆర్ఎస్ కార్యకర్త , పెద్ద ఏడ్గి గ్రామ కార్యకర్త, పడంపల్లి గ్రామ కార్యకర్త, హంగర్గా గ్రామ కార్యకర్త, చిన్నగుల్ల గ్రామ కార్యకర్త, వివాహ మహోత్సవం శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయా గ్రామాలలో శుభకార్యాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో  పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ వినోద్, కార్యకర్త రఘు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -