Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి 

విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి 

- Advertisement -

రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి 
బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి 
నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రతిపక్ష నాయకులపై విమర్శలుమాని నియోజకవర్గం అభివృద్ధిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టి పెట్టాలని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయడం చిగ్గుచేటని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని మాజీ జెడ్పిటిసి హైమావతి బాల్ రెడ్డి స్వగ్రాంలో  దోనూరు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బైరంపల్లి సర్పంచ్ గోపాల్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

యాసంగిలో రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం చేతగాక ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం చేతగానితనానికి, అసమర్ధత పాలనకు నిదర్శనం అని విమర్శించారు. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డ్ దగ్గర మొక్క జొన్న రైతులు గత కొన్ని  రోజుల నుండి పడిగాపులు కాస్తున్న  అధికారులు పట్టించుకోవడంలేదని  రైతులే స్వచ్ఛందంగా ధర్నా చేపట్టారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సర్పంచ్ ల సంఘం మాజీ మండల అధ్యక్షులు జంగారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల అధ్యక్షులు మంద భీమ్ రాజ్, మండల నాయకులు కాడయ్య,గంజి కృష్ణ,భీమ్ రాజ్,నామాని శ్రీనివాసులు,కరుణాకర్ రెడ్డి,సుకుమార్,ఆచారి, నవీన్ చారి,మావిల్ల వెంకటయ్య, బుచ్చయ్య, మంగలి నరసింహ, అనగల వెంకటయ్య, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -