- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో కొండ ప్రాంత రహదారిపై అదుపుతప్పిన ఓ వాహనం లోయలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. థనోల్ నుండి థుబ్ గ్రామానికి వెళ్తుండగా, మలుపు వద్ద వాహన డ్రైవర్ అదుపుతప్పడంతో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రేమ్ సింగ్ (50), ఆయన భార్య తురి దేవి (45), అత్త దుర్గి దేవి (70) మరణించారని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -



