Sunday, May 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతాలు, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం: సీపీఐ(ఎం)

తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం: సీపీఐ(ఎం)

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-మునుగోడు

రైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతులకు అమ్ముకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తాలు తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మండిపడ్డారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాకులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజుల గడుస్తున్న నేటికీ కొనుగోలు కేంద్రాలలో సగానికి పైగా కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎప్పుడు కొంటారోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

లారీల కొరత ఉందని సాకు చూపుతూ రైతుల నుండి వెయిటింగ్ చార్జీల పేరుతో నిర్వాకులు డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ? రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సరిపడా లారీల సౌకర్యాలను  కల్పించాలని అధికారులకు సూచించారు. సీరియల్ ప్రకారం లోడింగ్ చేయకుండా నిర్వాహకులు చేతివాటములు తీసుకొని లోడింగ్ చేస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం నుండి లోడింగ్ అయిన లారీలు  రైస్ మిల్లుల వద్ద దిగుమతి వెంటనే కాకుండా రెండు మూడు రోజులు ఉండడంతో లారీల కొరత తీవ్రంగా పెరిగిందని అన్నారు. మిల్లర్ల దగ్గర ధాన్యం లారీలను అన్లోడింగ్ సమస్య  తలెత్తకుండా ధాన్యం లోడింగ్ తో వచ్చిన లారీలను వెంటనే దిగుమతి చేసుకునే విధంగా మిల్లర్లకు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కొనుగోలు కేంద్రాలలో దళారి వ్యాపారులతో నిర్వాహకులు కుమ్మకై రైతుల పేర ధాన్యమును అమ్ముతున్న దళారుల ధాన్యాన్ని అధికారులు గుర్తించి దళారుల ధాన్యాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దళారులతో కుమ్మక్కైన నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతు ఖాతాల డబ్బులను జమ చేయాలన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించాలని ఈనెల 11న కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా, మండల గ్రామ, కార్యదర్శులు , కార్యకర్తలు,  రైతులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, సలీం , చాపల మారయ్య , సిఐటియు సభ్యులు ఎల్ రాజు , సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , వేముల లింగస్వామి , యాట యాదయ్య, కట్ట లింగస్వామి , పగిళ్ల మధు , రాంబాబు తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -