Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆప్రైజర్ లేకనే గోల్డ్ లోన్స్ ఆలస్యం.!

ఆప్రైజర్ లేకనే గోల్డ్ లోన్స్ ఆలస్యం.!

- Advertisement -

కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకెళ్ళాం
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

ఆప్రైజర్ దొరక్కనే స్ట్రాంగ్ రూమ్లో గోల్డ్ లోన్స్ అలస్యమవుతుందని,ఈ విషయాన్ని కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకపోయినట్టుగా తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. పిఏసిఎస్ లో స్ట్రాంగ్ రూమ్ నిరుపయోగంగా ఉంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. 2021లో పిఏసిఎస్ చైర్మన్ గా కొనసాగిన చేప్యాల రామారావు హయాంలో లాకర్స్,స్ట్రాంగ్ రూమ్ కోసం ప్రయత్నాలు చేయగా ఆచరణకు నోచుకోలేదని చెప్పారు.

తాను జులై 2024లో చైర్మన్ గా బాద్యతలు చేపట్టిన కొద్దీ రోజులకే స్ట్రాంగ్ రూమ్, టైల్స్  నిర్మాణం కోసం రూ.7 లక్షలు, కంపాoడ్ వాల్, మెయిన్ గేట్, అలారం సిస్టం, సిసి కెమెరాలు, క్యాష్ కౌoటర్, గ్రీట్ గేట్ తదితరవి కోసం రూ.13 లక్షలకు పాలకవర్గంచే తీర్మానం, ఎస్ట్ మేషన్ వేయించి, పర్మిషన్ కోసం డిసిఓ కార్యాలయానికి పంపునట్లుగా తెలిపారు. 2024 నవంబర్ లో పనులను అనుమతులు రాగా వెంటనే ప్రారంభించి 2025 జులైలో పనులు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఆగస్టులో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుచే ప్రారంభం చేసినట్లుగా తెలిపారు. 2025 సెప్టెంబర్ లో లాకర్ పర్మిషన్ కోసం డిసిఓ దరఖాస్తు పెట్టగా అక్టోబర్ లో పర్మిషన్ వచ్చినట్లుగా తెలిపారు.

పర్మిషన్ లెటర్, పాలకవర్గం తీర్మానం పత్రాలు  మెయిన్ బ్రాoచి కరీంనగర్ కెడిసి కార్యాలయానికి పంపగా డిసెంబర్ లో మీరు ఒక అప్రైజర్ ను మాట్లాడుకోవాలని ఆదేశించినట్లుగా తెలిపారు. గోల్డ్ లోన్ లో అప్రైజర్ గా పని చేయాలంటే ఆప్రైజర్ పేరిట రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ పేరిట మరో రూ.5 లక్షలు మొత్తం రూ.7 లక్షల డిపాజిట్ చేయడమే కాక ఆప్రైజర్ పదోవతరగతి ఉత్తీర్ణుడై అది స్వర్ణకారుడై, స్థానికుడై ఉండాలి.

ఇందుకు కులం, ఆదాయం, నివాసం పత్రాలు తదితర పిఏసిఎస్ కార్యాలయంలో సమర్పించాలానే నిబంధనల ప్రకారం ఆప్రైజర్ను చూస్తున్న క్రమంలోనే డిసెంబర్ 2025లో ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసినట్లుగా తెలిపారు. అనంతరం నాలుగు నెలలు స్పెషల్ అధికారి పాలన నడుస్తున్న నేపథ్యంలో ఈ నెల 5న హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం మళ్ళీ పాత పాలకవర్గాలకు అవకాశం ఇవ్వగా 7న తాను మళ్ళీ  చైర్మన్ బాధ్యతలు చేపట్టిన 8న ఎంసి మీటింగ్ పెట్టినట్లుగా తెలిపారు. ఈ మీటింగ్ లో సొసైటీ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించే నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన విషయాలు మాట్లాడినట్లుగా తెలిపారు. ఇందుకు సిఈఓ సంతోష్ పెద్దతూండ్ల గ్రామంలో ఒక ఆప్రైజర్ ముందుకు వచ్చినట్లుగా సోమవారం పూర్తీ విషయాలను మాట్లాడుతానాని సిఈఓ చెప్పినట్లు చైర్మన్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -